3, ఫిబ్రవరి 2021, బుధవారం

సమస్యా పూరణం - “బేధబావంబు బోధించె వేద మంత”, 20.01.2021 బుధవారం

 


20.01.2021 బుధవారం

ప్రణాళిక - సమస్యా పూరణం

ఈ క్రింది మకుటము తో తేటగీతి లో పద్యములు వ్రాయవలెను

బేధబావంబు బోధించె వేద మంత

ఇదే పంక్తితో వచన కవిత నాలుగు నుండి ఆరు పాదాలలో వ్రాయగలరు.

 

" *పద్యము వ్రాసినాడనని పల్కగ నొప్పునె  కృష్ణశాస్త్రికిన్ * “

రాము,  శాస్త్రి,  కృష్ణలు మంచి స్నేహితులు...శాస్త్రి పద్యరచనలో దిట్ట.. కృష్ణకు చదువు రాదు., రాము మెల్లగా పద్యరచన చేస్తూ, ఆ విషయం మిత్రుడు కృష్ణతో ముచ్చటిస్తూ, శాస్త్రి యొక్క మనస్థితి  గురించి చెబుతున్న సన్నివేశమిది....

 

ఉత్పలమాల... (భేద భావంబు భోదించె వేదమంత)

సేద్యము జేయుచున్, బిదప  జిక్కని పద్యము వ్రాయబూనగన్

బాధ్యత యుండియున్ మిగుల పద్యపు రాశులు క్రుమ్మరించియున్

హృద్యపు భావనల్ మదిన, దృష్టియు నంతయు నిచ్చటుండగన్

పద్యము వ్రాసినాడనని పల్కగ నొప్పునె  కృష్ణ ! శాస్త్రికిన్ ..

 

తేటగీతి.. (భేద భావంబు భోదించె వేదమంత)

వేదములు జీవకోటికి విశద పరచె

పరుని హింసకు గురి చేయ పాపమనుచు,

మనుజ సేవ పుణ్యమనుచు; మంచి చెడుల

భేద భావంబు బోధిం చె వేదమంత.

పి.ఎల్.నాగేశ్వరరావు

 

(భేద భావంబు భోదించె వేదమంత)

వేద సారంబు తెలియగా వివరముగను

సర్వ మానవ పశు పక్ష్య జాతులందు

దైవ ముండును  తప్పక తరచి చూడ

జీవ పరమాత్మ మధ్యలో క్షిప్తమైన

భేద భావంబు బోధించె వేదమంత

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

తేటగీతి (భేద భావంబు భోదించె వేదమంత)

ధనికుడైననేమి కడు పేదైన నేమి

బ్రాహ్మడైన శూద్రు డయిన బ్రాకులాడు

టేల ముక్తిని బొందగ టేను భక్తి యున్న

జాలు నన్న నిక్కంబును జాట గను న

భేద భావంబు భోధించె వేదమంత.

ఉష.

 

 

(భేద భావంబు భోదించె వేదమంత)

విశ్వ సృష్టి కర్త  యొకడున్నాడని

వానిలో విశ్వము, విశ్వమందున

వాడు కల్గినారని, సకల జీవులలో

నాతడాత్మగ వెలసి యున్నాడని

అ భేదభావంబు బోధించె వేద మంత

CA కె మల్లికార్జునరావు

 

"ఏనం విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా" నిర్వచనం ఆధారంగా... (భేద భావంబు భోదించె వేదమంత)

మర్మ మెరిగించక జనుల మభ్యపెట్టి

యిష్ట ప్రాప్తినొందు విధము లెరుగ నీర

నిష్ట పరిహారముల్ దాచు ద్రష్టలిలను

భేద భావంబు బోధించె వేద మంత

వాణిశ్రీ నైనాల

 

 

తే. (భేద భావంబు భోదించె వేదమంత)

మానవాళి యంతయును సమాన మనెడు

సత్యమెరుక పరచె ధర్మ సంహిత, పర

మాత్మ, యాత్మ లాకృతి దేహమను రహస్య

భేద భావంబు బోధించె వేద మంత

వెంకట్.సి హెచ్

 

 

ఓం శాంతి!  (భేద భావంబు భోదించె వేదమంత)

టీ కప్పుతో మొదలయ్యే తగాదాలు,

మనస్తత్వాల తేడాలు పెంచుకొంటూ

పట్టుదలలు వదలక కోపతాపాలతో ఊగిసలాడే వారికి

కుటుంబ పెద్దలు వేద సారంబు వడబోసి

నచ్చచెబుతూ , శాంత పరచినచో

వారే  సంతోషముతో మన బేధ భావంబులు

భోదించే వేదమంతా మనకు అంకొందురు తిరిగి వెడుతూ

జి మురళీ మోహన్ రావు

 

 

తేటగీతి (భేద భావంబు భోదించె వేదమంత)

అండ,పిండ, బ్రహ్మాండంబులస్థిరమని,

నేను మేనుల నిత్యతన్ నిగ్గ దీసి,!

ద్వైతమన్నదే లేని ద్రోవన్ దెలిపి,

భేద భావంబు  బోధించె వేదమంత!!

డా . నాగులపల్లి

 

 

తేటగీతి (భేద భావంబు భోదించె వేదమంత)

ధర్మసూత్రములనుజెప్పు  తత్వముండి

కర్మ ఫలములు దెల్పును ఖచ్చితముగ

మర్మమేమియు లేకయు మౌను లంత

ముక్తిమార్గాల సారము గను,

భేదభావంబు బోధించె వేద మంత.

హేమలత

 

వచనం, (భేద భావంబు భోదించె వేదమంత)

అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను,

కంచు మొగునట్టు కనకంబు మ్రోగునా,

యనుచు ఎన్నో నగ్న సత్యాలు ప్రజాకవి వేమన,

భేద భావమ్ము బోధించే వేదమంత...

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

(భేద భావంబు భోదించె వేదమంత)

శివుని రూపమే విష్ణువై శివము జేయ

విష్ణు రూపమే శివుడని విశ్వమంత

హరిహరమయమౌ జగతిని హరిహరుల.... య

భేద భావంబు బోధించె వేద మంత

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

సీ ll (భేద భావంబు భోదించె వేదమంత)

సకలజనాళియే చైతన్యమొందంగ విద్యుత్ స్రవంతియై వెలయు శక్తి

శబ్దముల్ చయములై జనియించుచుండగా సత్యార్థ సారముల్ చాటు శక్తి

కలుగుచేతన లోకకళ్యాణమును గూర్ప అక్షరాకృతి నందినట్టి శక్తి

నిస్పృహభూతము నిప్పులు జల్లంగ వాఙ్మయమొకహిమ వాహినియగు

 

తేటగీతి ll

విమతఖండన జేయుచుఁ విమలరీతి

దివ్యమార్గములను జూపు భవ్యరీతి

జ్ఞానధామమ్ము సారముల్ సత్యమెఱిగి

భేదభావంబు బోధించె వేదమంత

కస్తూరి శివశంకర్




 

మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ...  ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!!  మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .

1 . తల్లి

మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన... తల్లి మొదటి అద్భుతం.

 

 2 . తండ్రి

మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు 

మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు

దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ.. సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.

 

3 . తోడబుట్టిన  వాళ్ళు

మన తప్పులను వెనుకెసుకురావాడానికి... 

మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు...

తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం

 

4 . స్నేహితులు 

మన భావాలను పంచుకోడానికి.. 

మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...

ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం.

 

5 . భార్య / భర్త

ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా  చేస్తుంది

కలకాలం తోడు ఉంటూ... ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది.

భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం .

 

6 . పిల్లలు

మనలో స్వార్థం మొదలవుతుంది.. 

మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది... 

వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి.. 

వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది..

వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...

పిల్లలు ఆరో అద్భుతం.

అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?

 

7 . మనవళ్ళు మనవరాళ్లు

వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే  ఆశపుడుతుంది..

వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం

మళ్ళీ పసిపిల్లలం... అయిపోతాం.

వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం.

 

ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం...

కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి 

చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి. 

అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం. 



సమాప్తం 

******** 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...