21, ఫిబ్రవరి 2021, ఆదివారం

దత్తపది_74, బాధ, బోధ, గాథ, నాధ,01.02.2021 సోమవారం

 



01.02.2021 సోమవారం దత్తపది_74

బాధ, బోధ, గాథ, నాధ

 

వీటితో మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రామణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

దత్తపది: బాధ, బోధ, గాథ, నాధ

 

రామ గాథను వినిపించి రామ బంటు

బాధ తీరగ సీతకు భావి నందు

గాథ చెప్పగ  వనమందు గాలి పుత్ర

బోధ చేయగ రాముడు పవన సుతుకు

 

ఉత్పలమాల.. .

బోధన ఖర్చులన్ కపటి, మొండిగ బెంచుచు దెబ్బదీయగన్

బాధలు, రోదనల్ , ధవుడు ప్రక్కకు నెట్టుచు వేడ్కజూడగన్

గాదపు తిండియున్, ప్రజల గాథల జూడని పాఠశాలలున్

బాధిత పక్షమున్ నిలచి వాదన జేసెడి నాధులెవ్వరో  ?

 

గాదపు తిండి....గడ్డి తినడము

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

దత్తపది: బాధ, బోధ, గాథ, నాధ

వచనం.

చెడు బోధలు విని,

తల్లి దండ్రుల బాధలు పెట్టుచు,

జీవించిన కొమరుని  గాధను

పరికించిన  పండరినాధ, ఓ  పాండురంగా!

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

దత్తపది: బాధ, బోధ, గాథ, నాధ

కందము

బాధలు బాపగ రచనల

బోధలు జేసెను మనుజులు భోగము వీడన్

గాధగ సుందర గౌరీ

నాధుని ధూర్జటి శతకమునందున గొలిచెన్.....

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

దత్తపది: బాధ, బోధ, గాథ, నాధ

హాయి హాయిగా

బాధకములనుకష్ట మనుకున్నవియును

ఆహ్లాద పరుస్తూ అతిసులువుగా ,

ఆనందంగా భోధించుదురు బోధకులు గాధలుగా చెబుచూ .

 

అశ్రద్ధ పరులను నాధ వంతులనూ

సమ్మోహన పరచగల రెందరో గురువులు !

జి మురళీ మోహన్ రావు

 

 

దత్తపది: బాధ, బోధ, గాథ, నాధ

జగమున బాధలు లేని మనుజులెవరు?

యొక్కొక్కరి గాథ నొక్కొక్క రీతి నుండు,

జీవరాసులెల్ల నొక్కటను సద్బోధ నేర్వగ,

జగన్నాథుడు సతము మన రక్షగ నుండు.

 

సంపాదన నేర్పు వారు బాధ గురువులు

సంస్కారం నేర్పు వారు బోధ గురువులు

పలు గురువుల గాథ లు పరిశీలించినను

భేదము తెలియదు దారిచూపు గణ నాథ!

CA కె మల్లికార్జునరావు

 

 

దత్తపది: బాధ, బోధ, గాథ, నాధ

అంబా ధన్యుడ! నీ కటాక్షమును నా కై జూపి రక్షించగాన్

సంబోధించెద నమ్మయంచు నిను నా స్వాంతంబునన్ మోదమై

అంబోజాక్షి ననున్ యగాథ నివసున్ హాసావిలాసంబుతో

గంభీరమ్ముగ నీ యనాధ తనయున్ గాపాడ వీక్షించుమా

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

దత్తపదిబాధబోధగాథనాధ

ఉత్పలమాల

బాధలు లేని మానవులు , భక్తులు మొక్కని దైవముండునా !!

బోధలు చేయు సాధునకు పూజలు సేసిన మోక్షమిచ్చునా !!

గాధలు లేని జీవితము , కాంతులు చిమ్మని జాబిలుండునా !!

నాధుని పూజ చేయమని నారులు జెప్పిన నవ్వరే జనుల్ !!

రమ

 

 

దత్తపది: బాధ, బోధ, గాథ, నాధ

తేటగీతి

రామగాధను వినిపించె లవకుశలును

బాధ జెందిరి జనులును గాధ వినగ

రాజ్యనాధుడు వినెనంతరమ్య గీతి

బోధ బడకుండె బాలుర బుద్ధి పటిమ.

హేమలత

 

 

దత్తపది: బాధ, బోధ, గాథ, నాధ

కం||

బాధలు బెంచుచు ఘనముగ

బోధనలిల మెరుగు లేక పోటీ లేకన్

గాథలు విడిచిన బడిలో

నా ధనముకు విలువ లెచట నరుడా గనుమా!!

 

II

బాధలు మోయుచున్ సతము భర్తకు తోడుగ నెల్లవేళలన్

బోధన జేయుచున్ తరచు బుద్ధులు నేర్పగ బిడ్డ లిద్దరా

గాథలు సంతసంబుగను గాంచెడి రీతిన దెల్పు తల్లి తా

నాధుని గొప్ప లన్నియును నమ్ముచు బల్కెడి సాధ్వియే గదా

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

దత్తపది: బాధ, బోధ, గాథ, నాధ

సీ.

పరమ జానపదుల భాష నందుండెడి సంబోధన లొసంగు సంతసంబు

పల్లెజనుల బాధ లెల్లయు పదము గూర్చి జనపదులు బాడు రీతి లలిత

లావణ్య మొలకించు, రమణీయ గీతుల జానపదుల గాథ చరిత నందు

నిలిచి పల్లెజనుల నిగ్గులన్నిటి నెరిగించి, పాట సొబగు లింపు తెలుపు

 

గీ.

కొప్పరముగ నాథాతము కొరకు పల్లె

జనులు బడెడు సంకటములె సంతరించి

జానపద గీతములుగ ప్రాశస్త్య మొంది

జగతి నలరు చేయు విధము సంభ్రమమ్ము

 

నాథాతము= ఆహారం

వెంకట్.సి హెచ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...