10, ఫిబ్రవరి 2021, బుధవారం

దత్తపది - కాజ, పూజ, రాజ, తాజ, 29.01.2021 శుక్రవారం

 


29.01.2021 శుక్రవారం దత్తపది_73

కాజ, పూజ, రాజ, తాజ

 

వీటితో మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రామణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

 

వెలుతురెల్లెడ గాచ నీవెంట రాదు

తమసమునకు బెదరుటేల తరణి జూడు

మనువు గాని వేళ నెరిగి యణిగి యుండి

యుక్తి నేర్చి మరుదినము శక్తి జూపు

వాణిశ్రీ నైనాల

 

 

 

తేటగీతి...

పూజ సేయగ దాసుడై రాజరాజు

భక్తి మేరకా జలధిజ ముక్తి నొసగె

క్రమము వీడక  తా  జలకన్య గొలువ

రాజమకుటము భాసిల రాజ్యమేలె.....

జలధిజ.....లక్ష్మీదేవి

పి.ఎల్.నాగేశ్వరరావు



నేటి దత్తపది

కడు దరిద్రమున్ కడగండ్లు గల్గ, ప్రజలు

యజ్ఞయాగముల్జేయ గుర్వాజ్ఞ తోను!

తాజపుష్పములను దెచ్చి పూజ సలుప

 రాజ యోగము కలిగెనికా జనులకు!!

డా. నాగులపల్లి

 

 

తేటగీతి

నంద రాజ గృహముచేరె నల్లనయ్య !!

ద్వార కా జ నులందరు ధన్యులవగ !!

కృష్ణ పూజ లు చేసిరి తృష్ణ దీర !!

రాధ తా జ తగ నెదిగి లయము పొందె !!

రమ

 

 

 

తే. గీ.

ఆర్యులు దెలుప లలితా సహస్ర నామ

మొసఁగు సకల శుభములంచు, నుద్ధవముగ

దొడగిరి వని తాజ నములితోధికముగ

మాత కా జ పముల్, పూజ, మంగళకర

ముగ సలుపగ ;నీ రా జ నములనొసగిరి

 

భక్తితోడ, మనోపారవశ్యమొప్ప !

వట్టెం వెంకట రమణ

 

 

తేటగీతి

దత్తపది: రాజ, పూజ, తాజ, కాజ

పూలలో మేటి తరు రాజ పూజ లందు

తాజ కాజ దినిన జిహ్వ తన్వి నొందు

నాల్గు పదములమరె నిట్లు నవ్యరీతి

నర్ధమరయ లోగొనుమిది హాసగీతి!

లోగొను=క్షమించు

వాణిశ్రీ నైనాల

 

 

పూజ సేయగ భక్తిగ పుణ్య వతియు 

రాజ రాజుని భర్తగ రమణి పొంది

ముచ్చ టగతా జనెనుగ ముదము తోడ

మెట్టి నింటికి కాజన మెచ్చు కొనగ

 

 

 

ఈ రోజు దత్తపది రాజ, పూజ

వచనం,

రాజ పూజ, రవితేజ,

మహారాజ సీతా జయ రామ,

జరుగబోవు యుద్ధమున,

నీ కా జయ మాల నిశ్చయమ్మనె.. సుగ్రీవుండు.

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి,

 

 

తేటగీతి లో...

కాజ పుట్టినిల్లుగదర కాకినాడ

పూజనీయమగు స్వీటు పుడమిలోన

రాజ మర్యాద పొందునే భోజనమున

తాజ కాజలు తినరహో తన్మయమున.....

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

నేటి దత్తపది  ఆటవెలది లో......

రాఁజ. పూజ, తాజ. కాజ

జనకరాజ తనయ జానకీ దేవియు

లలిత పూజ జేయులాలితముగ

రాజ్యమందు తాజనులకురక్ష సల్ప

కరుణ జూపుకోరికాజననికి.

హేమలత

 

 

దత్తపది పూరణ తాజమహల్ వైభవము తెలుపు ఇతివృత్తంగా

సీ.

అది షాజహాన్ రాజు మది నుండి రూపుదాల్చబడి వెల్గొందె డీశాన్య భూమి

అదియె ముంతాజ్ ప్రేమ కంకితమయ్యిన ప్రణయదేవి నివాస రాజగృహము

అది పాలరాతితో నద్భుతముగ శిల్ప కారులు గూర్చిన ఖస్ఫటికము

అది పున్నమిదినము నలరుచేయునొక శో భాయమాన భువన స్వర్గసీమ

గీ.

అగ్రపూజ లందు కొనెడు యర్థపతియె

సతిని పూజించి నిర్మించె ప్రతిమ వోలె

తాజమహలున్ ప్రచురముగ; కాజి లబ్బు

ర పడెడు విధంబుగ సమాధి రాసికెక్కె

 

ఈశాన్య భూమి= శ్మశానం

కాజి= మహ్మదీయ మత గురువు

వెంకట్.సి హెచ్

 

 

కాజ దగ్గర కూచిపూడి లో

తాజా పూలతో పూజలన్నీ

రాజ వైభోగం కోసము కాదు

చక్కగా అలంకరించిన పూలతో

మనోరంజకంగా

కూచిపూడి నృత్య అభ్యాసాలు

నిర్యిరామంగా నేరుకోవచ్చు !

జి మురళీ మోహన్ రావు

 

 

( స్వర్గీయ శ్రీ S.P.బాలసుబ్రహ్మణ్యం గారికి నీరాజనం)

సీసం.... 

'పాడుతా తీయగా! పాడుతా చల్లగా!' పాడగ లేదాయె బాలు స్వరము

పండితారాధ్యుల వంశమ్ము నిలబెట్టి గగనమ్ము కేగిన గాత్రమతడు

స్వరములన్ బంధించి, స్వరరాగ ములతోట మల్లెలు బూయించు మాంత్రికుండు

పాటయే ప్రాణమై, పాటకు ప్రాణమై యూపిరి లూదిన యుక్కు పిడుగు

 

తేటగీతి...

నిన్ను మరువగ జాలము నిక్కువముగ

జన్మ జన్మల బంధమే జగతితోడ

మరల పుట్టగ రావయ్య మమ్ము జూడ

బాల గంధర్వ, మణిపూస, ప్రణతులిడుదు...

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

దత్త పది: రాజ , కాజ , పూజ , తాజ

సీసము

 

శంకరా! జడధారి! షణ్ముఖ జనకుడా! అంబికా జననికి నాప్త సఖుడ!

పన్నగ భూషితా! జన్నముఁ జేయుటన్ వరముల నొసగెడు భక్తవరద!

పార్వతీ వల్లభ! పరమదయాకర! సాంబసదాశివ! సన్నుతాంగ

సర్వే శ! పరమేశ! జగదీశ! భవ్యేశ! విశ్వేశ! మల్లేశ! వేదవేద్య!

 

నీకు పూజలు జేయగా నిత్యముగను

భక్త జనులకు యాపదల్ రిక్తమగును

ఆర్త జనులను గాచెడు యాది పురుష!

కరుణఁ జూపుము మాయందు కల్ప తరువ!

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

కాజ, పూజ, రాజ, తాజ

ఒక  గోపాలుని కా జ యము జయమని

నగ్ర పూజ జేయ సంకల్పించితిరి ఇందరు

రాజ వన్యులున్న నీ సభ నందున, ననుచు

వదరిన ధూర్తుడు శిశుపాలుని, శ్రీకృష్ణుడు

సుదర్శనము విసిరి శిరము దుంచగ, నిల

యందు మరి దేవ తా జ గమందు హర్షము

ధారలై కురిసే పువ్వులై విరిసే రయమున.

CA కె మల్లికార్జునరావు

 

 

 

అందాల పడతి...అపురూప స్నేహితుడు

 ఉత్పలమాల...

చిక్కని సౌష్టవమ్ము గల జిల్గుల చిన్నది తేజరిల్లుచున్

చక్కని మేనిఛాయ, మదిజారగ, మిత్రుడు జూచుచుండగన్

గ్రక్కున గౌగిలిన్ ప్రియుని రమ్మని మాటుగ భామబిల్వగన్

చిక్కిన భాగ్యముల్ వదలి చింతిల, పెద్దలు మందలింపగన్

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

పూజ తండ్రి రాజ పుట్టినరోజని,

క్రొత్త షర్టు నొకటి కొని ధరించె;

తాజ షర్టె  కాని, కాజ-వదులగుటన్,

బటనులూడి బొజ్జ బయట పడెను.

వట్టెం వెంకట రమణ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...