7, ఫిబ్రవరి 2021, ఆదివారం

27 01 2021 సమస్యా పూరణ , "పొగడ సౌందర్య మెంతయొ పొలతి వగచె"

 


27.01.2021 బుధవారం

ప్రణాళిక - సమస్యా పూరణం

ఈ క్రింది మకుటము తో తేటగీతి లో పద్యములు వ్రాయవలెను

"పొగడ సౌందర్య మెంతయొ పొలతి వగచె"

ఇదే పంక్తితో వచన కవిత నాలుగు నుండి ఆరు పాదాలలో వ్రాయగలరు.

 

 

*పొగడ  సౌందర్య మెంతయొ  పొలతి వగచె.. .*

తేటగీతి

ముగ్ధ, మందార విందమై ముదిత వెలుగ

పొంకమేల నీకని పతి పోరుసలిపె..

మొండి, కోరిక తరువాయి మోము గాంచి

పొగడ  సౌందర్య మెంతయొ, పొలతి వగచె.

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

బుద్ధి గడ్డి తినే

ఆ ఉద్యోగిణి ప్రతిభ కొచ్చె పురస్కారము

అభినందనలు తెలుపుటకువచ్చె తదితరులు

కొందరు కుర్రకారు ఉద్యోగులు గొణుగుచూ

ఆమెను పొగడ సౌందర్య మెంతయొయని, 

ఆ పొలతి వగచె క్షణములో తేరుకొని చెప్పె వారికి గట్టిగ

నీతి , నిజాయితీలతో శ్రమపడండి

 

ప్రేమలు , పగటి కలలు అవలే నుంచండి

అనుచు బయటకు వేలు చూపె !

జి మురళీ మోహన్ రావు

 

 

వలచితినని వేధించగ వనిత నొకడు

యామె ధిక్కార మోర్వక యాగ్రహమున

యామ్ల దాడి జేసెన్ వాడు యక్రమమున

జాలి జూపుల దోడను జనులు గతము

పొగడ సౌందర్య మెంత యొ పొలతి వగచె.

ఉష.

 

 

 

1 తే.

వేదనగ వగచెడు చెలి వెతలు దీర్చ

కుండ మాలిమి తెలిపెడు గుణము తోడ

నాగడముజేయుచు చెలికాడనుచితముగ

పొగడ సౌందర్య మెంతయొ, పొలతి వగచె

 

2 తే.

విరటుని కొలువు నందున వెలది సొగసు

గాంచి కీచకుం డుప్పొంగి కామవాంఛ

తోడ సైరంధ్రిని పరమ దోసముగను

పొగడ సౌందర్య మెంతయొ, పొలతి వగచె

వెంకట్.సిహెచ్

 

 

పొగడ సౌందర్య మెంత యొ పొలతి వగచె

అగ్ని సాక్షిగ పెండ్లాడె నంద రెదుట

బాసఁ జేసెను ప్రియురాలి బాయ కునికి

వేరె కాంతను తనముందు వింతగాను

పొగడ సౌందర్య మెంత యొ పొలతి వగచె.

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

 

తే గీ

తాను ప్రక్కల నుండిన తనను వీడి

ముద్దు గొల్పెడి మరదలి ముఖము జూచి

పద్య రచనలు జేసెడి పతి బలుకుచు

పొగడ సౌందర్య మెంతయొ పొలతి వగచె

 

తే గీ

వేసె మేకప్పు చక్కగ వేలు బోసి

పలుకరొక్కరు ముద్దుగ పడతిని గని

ముఖము కడిగిన పిమ్మట మోము జూచి

పొగడ సౌందర్య మెంతయొ, పొలతి వగచె

కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి

 

 

తేటగీతి

లక్ష్మి కళలొల్కు లావణ్య రాశి యైన వధువు నొకమారు

చూడగ వచ్చె ; వరుడుముగ్ద మోహనమగు చెలి మోము జూసి

ప్రియ విభుండు మైమరపుతో పేరు మార్చి

పొగడ సౌందర్య మెంతయు పొలతి వగచె

రమ

 

 

తేటగీతి

విరటుని కొలువున్ సైరంధ్రి మురువు చూసి

కాముకుడయి సింహబలుడు కలికి వెంట

బడుచు మదిరసేవించి ద్రౌపదిని జేరి

పొగడ సౌందర్యమెంతయు పొలతి వగచె

అవళూరు సీత

 

 

తే"

వంగునింద్రధనువు జూడు, నింగి జూడు

పూల, బారునేరును జూడు, పులుగు జూడు

మనుచు సరసనున్న తననిట్లలుసు చేసి

పొగడ సౌందర్య మెంతయొ పొలతివగచె

వాణిశ్రీ నైనాల

 

 

వచనం,

రూపమే శాపమాయె పడతి కి పాపం,

పాపము శమించు గాక ఇక,

ఏ పని చేయగ నొప్పదు యువతకు,

పొగడ సౌందర్యమెంతయొ, పొలతి వగచె తన దుస్థితికి.

గాంగేయ శాస్త్రి రాజమండ్రి,

 

 

 

అలరు జెంగల్వ పుప్పోళ్ళ లలనపాద 

పద్మయుగ్మముల్ కెంపారు సద్మమందు 

శారదేందు వినిర్మల సౌధతలము !     

విమల చంద్రుడు కలితమై వెల్గువేళ 

యామినీ సమయమున పర్యంకములన

సారస పరాగములు జిల్కు జావళీల

స్వఛ్చమౌ మంచుపాటలే పల్కరించె 

స్వాదు గీతులందించగా పరవశమున ! 

పొగడ సౌందర్య మెంతయొ ! పొలతి వగచె

కాటుకకనులన్ కినుకలు నాటుకొనగ

స్పురద శోకములో జాజి పూలు విసిరి 

రమ్యకుముద ద్యుతి గల శరత్తు లేక !

కస్తూరి శివశంకర్

 

 

 

వచన కవిత

అశోక వనముననున్న అవని జాత

ఆవేదన తోడ నల్లాడు  చుండగా అప్సరసను మించిన అందము నీదని

నీపొందు నాకున్న నే ధన్యుడ నౌతునని

పొగడ సౌందర్య మెంతయొ, పొలఁతి వగచె లంకేశుని నీచబల్కులచే.

హేమలత

 

 

సుందరాంగిని జేరిరి మందకొడిగ

వెకిలి చేష్టలు జేయగ వెంట పడుచు

పదుగురిబ్బంది పరచుచు పడతి నతిగ

పొగడ సౌందర్య మెంతయొ పొలతి వగచె

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...